సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే ఏం జరుగుతుందో ? అనే దానికి తాజా సంఘటనే ఉదాహరణ. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. ఓ రోజు గుర్తు తెలియని వ్యక్తి నుంచి అందమైన అమ్మాయిలతో డేట్ చేస్తారా ? అన్న మెసేజ్ వచ్చింది. ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే వారితో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓ రోజు ఓ మువతి ఫోన్ చేసి ఆ ఉద్యోగి అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేసింది. ఆ తర్వాత రు. 20 వేలు చెల్లిస్తే నగ్నంగా కాల్ చేస్తామని ప్యాకేజ్ రేట్లు చెప్పింది.
తర్వాత అతడి వాట్సాప్‌కు కొందరు యువతుల అశ్లీల చిత్రాలు వచ్చాయి. అతడు నగ్నంగా యువతి కాల్ చేసేందుకు రు. 20 వేలు చెల్లించాడు. ఆమె నగ్నంగా కాల్ చేయగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఆమెతో నగ్నంగానే మాట్లాడాడు. అదే టైంలో సైబర్ కేటుగాళ్లు అతడి వీడియోకాల్ ఫొటోలను క్యాప్చర్ చేశారు. తర్వాత అతడికి ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ముందు రు. 50 వేలు తర్వాత మొత్తంగా రు. 2 లక్షలు ఇచ్చాడు.
తర్వాత సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫోన్ ఎత్తలేదు. దీంతో సైబర్ నేరగాళ్లు అతడి నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ అంతా మోసమని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.