దళిత యువకుడికి శిరోముండనం చేయించడం ఆ తర్వాత మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ పేరిట పలువురు అధికారులకు ఫోన్లు చేసి మోసం చేసిన కేసులో బిగ్‌బాస్ ఫేం నూతన్ నాయుడును సోమవారం పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. విశాఖ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి అరిలోవ సెంట్రల్ జైలుకు తరలించారు. శని, ఆది, సోమవారాల్లో విచారణ చేయగా… ఈ విచారణలో నూనత్ నాయుడు పోలీసులకు ఎంత మాత్రం సహకరించలేదట.
దళిత యువకుడికి శిరోముండనం చేసినప్పుడు తాను రాజమండ్రిలో ఉన్నట్టు నూతన్‌నాయుడు చెప్పినట్టు సమాచారం. ఇక శిరోముండనం చేసేముందు నీ భార్య నీకు ఫోన్ చేసిందన్న విషయంపై కూడా పోలీసులు అతడని ప్రశ్నించగా.. నూతన్ నాయుడు మాత్రం తనకు కడుపులో నొప్పిగా ఉందని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
ఇక నూతన్ నాయుడు ఇప్పుడు కేవలం దళిత యువకుడికి శిరోముండనం కేసు మాత్రమే కాకుండా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట ప్రభుత్వ వైద్యులకు ఫోన్ చేయడం… ఉద్యోగాలు ఇప్పిస్తానని రు. 12 కోట్లు వసూలు చేసిన కేసుల్లో కూడా చిక్కుకున్నారు. ఈ రెండు కేసుల్లో కూడా పోలీసులు నూతన్ నాయుడిని విచారించారట. ఏదేమైనా ఈ కేసుల విషయంలో నూతన్ నాయుడు హైడ్రామాలు పీక్స్‌లోనే ఉన్నాయి.