ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంగతి తెలిసిందే. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ ఎమ్మెల్సీ అవ్వడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఇక చంద్రబాబు 2002లో సీఎంగా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ టైంలో తారకరత్నను కూడా స్టార్ హీరోను చేయాలని ఒకేసారి 9 సినిమాలతో ప్రారంభోత్సవం చేశారు. ఈ సినిమాలన్నింటికి సీఎం హోదాలో చంద్రబాబే క్లాప్ కొట్టారు.
అదే సమయంలోనే 2002లోనే చంద్రబాబు తనయుడు లోకేష్‌ను హీరో చేయాలని ముందుగా అనుకున్నారు. ఆ సమయంలో చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సూపర్ హిట్లతో ఉన్న తేజ దర్శకత్వంలో ఓ సినిమా కథ చర్చలు కూడా జరిగాయి. కంప్లీట్ లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీతో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. రంగం అంతా సిద్ధమైంది. డమ్మీ షూటింగ్ కూడా జరిగింది.. దీనిపై వార్తలు కూడా వచ్చాయి.
ఆ తర్వాత ఏం జరిగిందో కాని ఈ ప్రాజెక్టు సడెన్‌గా ఆగిపోయింది. హీరో కావాల్సిన లోకేష్ డ్రాప్ అయ్యాడు. ఇక లోకేష్‌కు బాలయ్య కుమార్తె బ్రాహ్మణితో 2007లో వివాహం జరిగాక ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు.