Newsవామ్మో పార్ల‌మెంటులో అంత‌మంది ఎంపీల‌కు క‌రోనానా..

వామ్మో పార్ల‌మెంటులో అంత‌మంది ఎంపీల‌కు క‌రోనానా..

పార్ల‌మెంటు స‌మావేశాలు సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క ఎంపీకి కోవిడ్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి చేశారు. దీంతో దేశ‌వ్యాప్తంగా ఉన్న లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీలు అంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా పార్ల‌మెంటుకు హాజ‌రైన 25 మంది ఎంపీల‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. మొదట ఈ సంఖ్య 17 అని అని తేలినప్పటికీ మరో 8 మంది ఎంపీలు కరోనా భారిన పడ్డట్టు ప‌రీక్ష‌ల్లో తేలింది. ఇక కోవిడ్ భారీన ప‌డ్డ ఎంపీల‌లో మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేష్ సాహిబ్ సింగ్, సుఖ్‌బీర్ సింగ్, హనుమాన్ బెనివాల్, ఎస్.మజుందార్, గొడ్డేటి మాధవి, ప్రతాప్ రావు జాదవ్, జనార్దన్ సింగ్, బిద్యుత్ బరణ్ ఉన్నారు.

వీరితో పాటు ప్రదాన్ బారువా, ఎన్.రెడ్డప్ప, సెల్వం జి, ప్రతాపరావు పాటిల్, రామ్ శంకర్ కథేరియా, సత్యపాల్ సింగ్, రాడ్మల్ నగర్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇక తాజాగా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన మ‌రో ఎనిమిది మంది ఎంపీల పేరును కూడా త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ఏపీకి వచ్చే స‌రికి రెండు రోజుల్లోనే ముగ్గురు అధికార వైఎస్సార్‌సీపీ ఎంపీల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

 

నిన్న కాకినాడ ఎంపీ వంగా గీత‌కు క‌రోనా పాజిటివ్ రాగా నేడు అర‌కు ఎంపీ గొడ్డేటి మాధ‌వి, చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌కు కూడా క‌రోనా వ‌చ్చింది. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన జేఎంఎం నేత శిబు సోరెన్, డీఎంకే ఎంపీ టి.శివ తదితరులు సోమవారంనాడు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ కారణంగానే ఎంపీలు సంతకం చేసిన పెన్నులను ఎప్పటికప్పుడు మార్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news