Moviesసూర్య‌కిర‌ణ్ బిగ్‌బాస్‌లో ఆమెను ఎందుకు టార్గెట్ చేశాడు... ఆ ఆగ్ర‌హం వెన‌క‌..?

సూర్య‌కిర‌ణ్ బిగ్‌బాస్‌లో ఆమెను ఎందుకు టార్గెట్ చేశాడు… ఆ ఆగ్ర‌హం వెన‌క‌..?

బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ విజ‌య‌వంతంగా తొలి వారం పూర్తి చేసుకుంది. హౌస్ నుంచి ఫ‌స్ట్ కంటెస్టెంట్‌గా డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ నుంచి వెళ్లి పోయే ముందు సూర్య కిరణ్ ఇంటి సభ్యులందరి గురించి మాట్లాడాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే నాగార్జున కొన్ని జంతువుల పేర్లు ఇచ్చి హౌస్‌లో ఆ జంతువుల‌కు సూట్ అయ్యే వ్య‌క్తుల పేర్లు మ్యాచ్ చేయ‌మ‌ని సూచించాడు.

 

దీంతో సూర్య‌కిర‌ణ్ గంగవ్వను చీమతో – దేవిని మొసలితో – సోహెలెను ఎలుకతో – అభిజిత్‌ను పిల్లితో పోల్చాడు. ఇక దివిని తాబేలుతో – కళ్యాణిని కోతితో మెహబూబ్ ను గద్దతో – హారికను పాముతో – జోర్దార్‌ సుజాతను కుక్కతో –  సోహెల్ ను నక్కతో – లాస్యను గాడిదతో – అరియానాను గుడ్లగూబతో – అఖిల్ ను దున్నపోతుతో –  చివరకు అమ్మ రాజశేఖర్‌ను సింహంతో పోల్చాడు. ఎవ‌రిని ఏ జంతువుతో పోల్చినా ఎవ‌రి మ‌న‌సు నొప్పించ‌కుండా ప్ర‌తి జంతువుకు మంచి అర్థం చెప్పాడు.

 

 

అయితే హారికను మాత్రం పాముతో పోల్చాడు సూర్య కిరణ్ ఆమెపై కాస్త ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టే క‌నిపించింది. పాము విషం చిమ్ముతుంది.. చాలా యాక్టివ్‌గా ఉంటుంది.. అయితే నువ్వు విషం చిమ్మ‌కుండా మంచిగా ఉండాల‌న్న కోణంలో మాట్లాడాడు. ఆమెలో విషం ఉన్నట్లుగా షాకింగ్ వ్యాఖ్యలు చేయ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది ?  ఎందుకు ఆమె ఒక్క దానిపైనే సూర్య కిర‌ణ్ ఆగ్ర‌హంతో మాట్లాడాడు అన్న చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news