Politicsషాకింగ్‌: గాల్వాన్‌లో 60 మంది చైనా సైనికులు మృతి

షాకింగ్‌: గాల్వాన్‌లో 60 మంది చైనా సైనికులు మృతి

భార‌త్ – చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు ప్రాంతంలో గాల్వాన్ లోయ‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక గ‌త జూన్ 15న గాల్వాన్ లోయ‌లో ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డ‌డంతో పాటు చైనా ద‌ళాలు క‌వ్వింపు చ‌ర్చ‌ల‌తో 20 మంది భార‌త జ‌వాన్ల‌ను పొట్టన పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న‌లోనే 60 మందికి పైగా చైనా సైనికులు కూడా మృతి చెందార‌ని.. అమెరికాకు చెందిన న్యూస్ వీక్ వార్తా ప‌త్రిక సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌చురించింది. ఈ క‌థ‌నం ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

PLA troops had attacked unarmed Indian soldiers with stones, iron rods, and  clubs wrapped with barbed wire: Reports

త‌మ సైనికులు 60 మంది మృతి చెంద‌డంతో ఆ దేశ అధ్య‌క్షుడు జిన్ పింగ్ దీనిని తీవ్ర అవ‌మానంగా భావిస్తున్నార‌ని కూడా ఆ క‌థ‌నం పేర్కొంది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత కూడా చైనా సైన్యం మ‌రో దూకుడు చర్య‌కు సిద్ధ‌మైంద‌ట‌. ఇక గాల్వాన్ ఘ‌ర్ష‌ణ‌లో మ‌న దేశానికి చెందిన 20 మంది సైనికులు మృతి చెందిన విష‌యాన్ని భార‌త ప్ర‌భుత్వం కూడా స్ప‌ష్టం చేసింది.

Ladakh face-off | China's People's Liberation Army meticulously planned  attack in Galwan, says senior government official - The Hindu

అయితే చైనా పీఎల్ఏ మాత్రం త‌మ దేశానికి చెందిన 60 మంది సైనికులు చ‌నిపోతే మాత్రం ఎందుకు వెల్ల‌డించ‌లేదు.. ఇక్క‌డే అనేక సందేహాలు తలెత్తుతున్నాయ‌ని న్యూస్ వీక్ ప్రశ్నించింది. ఇక చైనా చ‌ర్య‌ల‌తో 50 ఏళ్ల త‌ర్వాత భార‌త్ త‌న దూకుడు ప్ర‌ద‌ర్శించింద‌ని కూడా న్యూస్ వీక్ పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news