ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై మోడల్ పౌలా తీవ్ర ఆరోపణలు చేశారు. తాను హౌస్‌ఫుల్ సినిమాలో ఓ పాత్ర కోసం వెళ్లినప్పుడు సాజిద్ తనను లైంగీకంగా వేధించడంతో పాటు తీవ్ర ఇబ్బంది పెట్టాడని పౌలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. మీ టూ ఉద్యమం ప్రారంభమైనప్పుడే సాజిద్ ఖాన్‌పై చాలా మంది ఆరోపణలు చేశారని.. కాని ఆయనపై ఆరోపించేందుకు అప్పుడు తనకు ధైర్యం సరిపోలేదని చెప్పిన పౌలా ఇప్పుడు నా పేరెంట్స్ నాతో లేకపోవడంతో ధైర్యంగా స్పందిస్తున్నానని చెప్పింది.
నాకు 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సాజిద్ లైంగీకంగా వేధించడంతో పాటు చాలా అసభ్యంగా మాట్లాడాడని చెప్పింది. ఇక నన్ను తాకడానికి ప్రయత్నించడంతో పాటు లైగీకంగా వేధించాడని కూడా చెప్పింది. ఇక తన ముందే ఓ సారి బట్టలు విప్పమని అడిగాడని.. సాజిద్ ఎంతమంది అమ్మాయిలతో అలా ప్రవర్తించాడో ఆ దేవుడికే తెలియాలని వాపోయింది. ఇలాంటి నీచులు జైల్లోనే ఉండాలి.. అతడి నిజ స్వరూపాన్ని తాను ఇప్పటి వరకు బయట పెట్టకపోవడమే తాను చేసిన తప్పు అని పౌలా సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్లో సంచలనంగా మారాయి.