ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తున్నా కూడా సెక్స్ వర్కర్లు తమ వృత్తిని ఆపడం లేదు. దేశవ్యాప్తంగా సెక్క్స్ వర్కర్లతోనే ఎక్కువుగా కరోనా వస్తుందన్న నివేదికలు ఉన్నా కూడా వ్యభిచారం మాత్రం ఎక్కడా జోరు తగ్గడం లేదు. విటులు శృంగారం కోసం పరితపించి పోతున్నారు. తాజాగా యూపీలోని బరేలీ గంగోత్రి నగర్‌లోని ఓ ఇంట్లో కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తోన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు చేసిన దాడుల్లో 50 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు, ఆరుగురు సెక్స్ వర్కర్లు సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి సాధారణ హెల్త్ పరీక్షలు చేయగా కరోనా ఉందన్న షాకింగ్ విషయం బయటకు వచ్చింది. వ్యభిచారం చేస్తోన్న ఆరుగురు సెక్స్ వర్కర్లలో ఐదుగురు కరోనా పాజిటివ్‌తో ఉన్నారు. దీంతో ఇప్పుడు అధికారులకు పెద్ద చిక్కే వచ్చి పడింది.
వీరిలో శృంగారంలో పాల్గొన్న విటులు ఎవరో ఆరా తీయడం ఆ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. వారిని గుర్తించని పక్షంలో ఆ చుట్టు పక్కల కరోనా మరింతగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలు వస్తున్నాయి. ఇక కరోనా వచ్చిన సెక్స్ వర్కర్లను కూడా క్వారంటైన్‌కు తరలించారు. కరోనా తగ్గిన తర్వతే వారిని అరెస్టు చేయనున్నారు.