అతడు నిజామాబాద్‌కు చెందిన యువకుడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికాకు చెందిన ఓ అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ఆమెను మాటల మత్తులోకి దింపాడు. చివరకు ఆమె అభ్యంతకర ఫొటోలు పంపమని వాటితో ఆమెనే బ్లాక్ మెయిల్ చేయడ ప్రారంభించాడు. చివరకు ఆ బీటెక్ బాబు ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. నిజామాబాద్‌కు చెందిన సందీప్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉన్నాడు.
ఇన్‌స్టా గ్రామ్ అక్కౌంట్ ఓపెన్ చేసి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి వారిని వేధిస్తున్నాడు. అమెరికాలో ఉంటోన్న ఓ భారతీయ యువతికి సైతం రిక్వెస్ట్ పంపి ఆమెతో మాట కలిపాడు. ఆమెను మాయ చేసి ఆ యువతి అభ్యంతకర ఫోటోలు తీసుకున్న సందీప్… ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. న్యూడ్ ఫోటోలు పంపాలని బ్లాక్‌మెయిల్ చేశాడు.
తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆమె పంపిన ఆమె అభ్యంతరకర ఫొటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఆమె సందీప్‌ను బ్లాక్ చేయడంతో ఆ అమ్మాయి ఫోటోలని ఫ్రెండ్స్ కు పంపాడు. దీంతో భయపడి ఆ యువతి తలిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి సందీప్‌ను అరెస్టు చేశారు.