టాలీవుడ్లో సీనియర్ హీరో నాగార్జున గ్లామర్ సీక్రెట్ ఏంటో ఎవ్వరికి తెలియదు. మనోడు ఆరు పదుల వయస్సులోనూ కుర్ర హీరోగానే ఉంటాడు. ఆయన తరం హీరోలలో చిరు, బాలయ్య, వెంకీ కన్నా కూడా నాగార్జున ఆస్తులే ఎక్కువ ఉన్నాయంటారు. నాగార్జున ముందు నుంచి హీరోగా సక్సెస్‌ల కంటే కూడా బిజినెస్‌పైనే ఎక్కువుగా కాన్సంట్రేషన్ చేస్తూ వచ్చారు. రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని ముందుగా వివాహం చేసుకున్న నాగార్జున ఆమెతో మనస్పర్థలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చి హీరోయిన్ అమలను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.
ఇక నాగార్జునకు తండ్రి ఏఎన్నార్ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు తాను సినిమాల్లో నటించిన ఆస్తుల విలువే కోట్లలో ఉంది. అన్నింటికి మించి నాగార్జున రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయన హైదరాబాద్, అమరావతి, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరు రియల్ ఎస్టేట్‌లో కూడా భారీ పెట్టుబడులు పెట్టారన్న టాక్ ఉంది. ఆయన ఆస్తులు చూస్తే కళ్లు జిగేల్ మనేలా, మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటాయి.
ఇప్పుడు టాలీవుడ్లో రిచ్చెస్ట్ పర్సన్స్‌లో నాగార్జున ఒకడు. 2019 లెక్కల ప్రకారం ఆయన నికర ఆస్తులు 850 కోట్ల రూపాయలు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం చూస్తే నాగార్జున ఆస్తుల విలువ రు. ఐదారు వేల కోట్లకు పై మాటే అన్న టాక్ ఉంది. ఆయన చరాస్తులే కోట్లలో ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆయన ఆస్తులకు ఏ హీరో కూడా సాటిరాడంటే ఆయన ఆస్తుల రేంజ్ ఏంటో తెలుస్తోంది.