ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగన్కు పెద్ద మామా, సీఎం సతీమణి వైఎస్. భారతి పెదనాన్న ఈసీ పెద్ద గంగిరెడ్డి మృతి చెందారు. 78 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనకు ఇటీవలే కాస్త ఉపశమనంగా ఉండడంతో ఆయన స్వగ్రామం అయిన గొల్లల గూడూరు వచ్చారు.
అయితే నిన్న ఆరోగ్యం విషమించడంతో పులివెందుల ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని గోల్లలగూడూరుకు తరలించారు. జగన్ తల్లి విజయమ్మ, జగన్ సతీమణి భారతిరెడ్డి గొల్లగూడూరుకు చేరుకుని గంగి రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు.