Moviesక్రేజీ హీరోయిన్‌కు క‌రోనా పాజిటివ్‌... కానీ భ‌లే ట్విస్ట్ ఇచ్చిందే..!

క్రేజీ హీరోయిన్‌కు క‌రోనా పాజిటివ్‌… కానీ భ‌లే ట్విస్ట్ ఇచ్చిందే..!

ప్ర‌పంచ మ‌హ‌హ‌మ్మారి క‌రోనా ఏ ఒక్క‌రిని వ‌ద‌ల‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది సెల‌బ్రిటీల‌కు కూడా క‌రోనా పాజిటివ్ సోకుతోంది. దేశంలో ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులు, సినిమా వాళ్ల‌కు సోకుతోన్న ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌తో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఎంతోమంది ప్ర‌ముఖుల‌కు సైతం క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే క్రేజీ హీరోయిన్ జెనీలియాకు సైతం క‌రోనా వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆమే స్వయంగా వెల్ల‌డించింది.

 

అయితే అక్క‌డే జెనీలియా ట్విస్ట్ ఇచ్చింది. త‌న‌కు క‌రోనా మూడు వారాల క్రితం సోకింద‌ని.. ఇప్పుడు దేవుడి ద‌య‌తో నెగిటివ్ వ‌చ్చింద‌ని చెప్పింది. ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. హాయ్ నాకు క‌రోనా మూడు వారాల క్రితం సోకింది… అప్పుడు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో తాను క‌రోనా ప‌రీక్ష చేయించుకుంటే క‌రోనా పాజిటివ్ అని తేలింద‌ని.. ఇక ఐసోలేష‌న్‌లో ఉన్న 21 రోజులు త‌న‌కు చాలా క‌ష్టం అనిపించింద‌ని జెనీలియా చెప్పింది.

Lesser Known Facts About Genelia D'Souza You Didn't Know

ఎన్ని సోష‌ల్ మీడియా మాధ్య‌మాలు ఉన్నా ఒంటరి తనాన్ని జ‌యించ‌డం మాత్రం క‌ష్టం అని జెనీలియా చెప్పింది. ప్ర‌స్తుతం క‌రోనా నుంచి కోలుకుని తిరిగి నా కుటుంబంతో క‌ల‌వ‌డం మాత్రం ఆనందంగా ఉంద‌ని చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news