మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత రెండేళ్లుగా నానుతూ నానుతూ వస్తోంది. తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యిందో లేదో వెంటనే ఇది కాపీ అంటూ ప్రచారం మొదలైపోయింది. ఈ కథ నాదేనని.. ఈ కథను తాను మైత్రీ మూవీ మేకర్స్‌కు ముందే చెప్పానని.. తన లైన్‌ను కాపీ కొట్టే కొరటాల ఆచార్య సినిమా చేస్తున్నాడంటూ అసిస్టెంట్ డైరెక్టర్ నండూరి రాజేష్ ఆరోపిస్తున్నాడు.
ఇదే విషయమై కొరటాల ఈ రోజు ఓ ఛానెల్ లైవ్‌లోకి వచ్చి తనపై ఆరోపణలు చేస్తోన్న అసిస్టెంట్ డైరెక్టర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. నన్ను అనవసరంగా బ్లేమ్ చేసే గేమ్ ఆడుతున్నారని.. ఆయన చెప్పిన లైన్‌కు తన సినిమా కథకు అసలు సంబంధమే లేదని కొరటాల చెప్పారు. ఇప్పుడు కూడా రాజేష్ తనపై ఆరోపణలు చేస్తే తాను కోర్టులో తేల్చుకుంటానని కొరటాల హెచ్చరించారు. చాలా సేపు రాజేష్‌కు, కొరటాలకు మధ్య లైవ్‌లో తీవ్ర వాగ్వివాదం జరిగింది.
ఇక దీనిపై చిత్ర యూనిట్ కూడా స్పందించింది. ఆచార్య కథను భద్రంగా ఉంచామని.. అనవసరంగా కొరటాల పేరును బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చింది. మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినంత మాత్రాన కథ కాపీ అనడం తగదని సూచించింది. ఇక కాజల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.