రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ 4 కోసం ఇప్పుడు ఎంతో మంది ఆసక్తితో ఉన్నారు. ఈ నెల 29 లేదా 30న బిగ్‌బాస్ తొలి ఎపిసోడ్ ప్రసారం అవుతుందని అంటున్నారు. మరోవైపు స్టార్ మా ప్రోమోలతో దుమ్ము రేపుతోంది. ఇక బిగ్‌బాస్‌లో పాల్గొనే 15 మంది కంటెస్టెంట్లు ఇప్పటికే హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ హోటల్లో క్వారంటైన్లో ఉన్నారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్ లేట్ అవ్వడంతో ఈ షోకోసం మరింత ఆసక్తి పెరుగుతోంది. లాక్డౌన్ వల్ల ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతోన్న ప్రేక్షకులు ఇప్పుడు బిగ్‌బాస్‌ను ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు.
ఈ సారి షోలో టాప్ సెలబ్రిటీలు ఉండడంతో పాటు అదిరిపోయే కలరింగ్ కూడా ఉందంటున్నారు. ఇక ఈ సీజన్లో హౌస్‌లోకి వెళ్లబోతోన్న కంటెస్టెంట్ల గురించి రకరకాల చర్చలు స్టార్ట్ అయ్యాయి. సీనియర్ నటి, ఆంటీ సురేఖవాణి సైతం ఈ సారి షోలో కంటెస్టెంట్‌గా వెళుతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె బిగ్‌బాస్ ఎంట్రీపై కుమార్తె సుప్రీత స్పందించారు.
తన తల్లి బిగ్‌బాస్ ఎంట్రీ గురించి తనకు తెలియదని… ఈ విషయం తన తల్లి తనతో చెప్పలేదని చెప్పింది. అలాగే మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే. ప్రస్తుతం తన వయస్సు 20 సంవత్సరాలు మాత్రమే అని.. తన మనస్సుకు నచ్చినవాడు దొరికిన వెంటనే తన పెళ్లి ఉంటుందని చెప్పింది. ఏదేమైనా సురేఖ వాణి ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకుంటున్న టైంలో ఆమె కుమార్తె షాకింగ్ ట్విస్ట్ ఇవ్వడంతో ఇప్పుడు ఆమె బిగ్‌బాస్‌లో ఉంటుందా ? లేదా ? అన్న సందేహం నెలకొంది.