Gossipsప‌వ‌న్ ఫ్యాన్స్ గ‌గ్గోలు... ఐరెన్‌లెగ్ బ్యూటీకి పిలిచి మ‌రీ ఛాన్సా...!

ప‌వ‌న్ ఫ్యాన్స్ గ‌గ్గోలు… ఐరెన్‌లెగ్ బ్యూటీకి పిలిచి మ‌రీ ఛాన్సా…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌కు చాలా రోజుల త‌ర్వాత ఊపిరి లూదిన సినిమా గ‌బ్బ‌ర్‌సింగ్‌. హ‌రీష్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బండ్ల గ‌ణేష్ నిర్మాత‌గా వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అయ్యింది. ప‌వ‌న్‌కు మాంచి మాస్ ఇమేజ్‌ను డ‌బుల్ చేసింది. ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ప‌వ‌న్ – శృతి జంట‌కు మంచి మార్కులు కూడా ప‌డ్డాయి. ఆ సినిమాకు ముందు తెలుగులో అనగనగా ఓ ధీరుడు – ఓ మై ఫ్రెండ్ లాంటి ప్లాప్ సినిమాల్లో శృతీహాస‌న్‌కు ఆ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో ఐరెన్‌లెగ్ ముద్ర ప‌డిపోయింది.

 

ప‌వ‌న్ అవేవి ప‌ట్టించుకోకుండా గ‌బ్బ‌ర్‌సింగ్‌లో ఆమెకు ఛాన్స్ ఇచ్చి హిట్ ఇచ్చాడు. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డంతోనే శృతి ద‌శ మారి ఆమె గోల్డ‌న్‌లెగ్ అయ్యింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ అప్ప‌డికే ఫేడ‌వుట్ అయిన శృతికి కాట‌మ‌రాయుడు సినిమాలో మ‌రోసారి ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలో శృతి షేపులు పూర్తిగా మారిపోయాయి. అసలు ప‌వ‌న్ – శృతిని తెర‌మీద చూసేందుకే ఎబ్బెట్టుగా అనిపించింది. ఇప్పుడు శృతి మ‌రీ బొద్దుగా మారి.. ఆమె రూపం కూడా చూడ‌లేని ప‌రిస్థితి వ‌చ్చేసింది.

 

ఆమెకు ర‌వితేజ సినిమా త‌ప్పా ఛాన్సులు కూడా లేవు. ఇక ఇప్పుడు గ‌బ్బ‌ర్‌సింగ్ 2 సినిమాకు కూడా ప‌వ‌న్ శృతినే రిక‌మెండ్ చేశాడ‌ట‌. అయితే బండ్ల గ‌ణేష్ మాత్రం ఆమె వ‌ద్దే వ‌ద్ద‌ని ప‌వ‌న్‌కు చెప్పినా ప‌వ‌న్ విన‌డం లేదంటున్నారు. మ‌రోవైపు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో శృతిని ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్‌గా ఊహించుకోలేమ‌ని.. ఆమె త‌మ‌కు వ‌ద్దే వ‌ద్దో అని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ త‌న మ‌న‌స్సు మార్చుకుంటాడేమో ? చూడాలి. విచిత్రం ఏంటంటే ఇప్పుడు కూడా హిట్లు.. అస‌లు సినిమా ఛాన్సులే లేని శృతిని అంద‌రూ ఐరెన్‌లెగ్గే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news