టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వివి.వినాయక్ కెరర్ ఘోరమైన స్థితిలో ఉంది. ఓవైపు సినిమా ఛాన్సులు ఇచ్చేవాళ్లు లేరు. వినాయక్ చివరి మూడు సినిమాలు చూస్తే అఖిల్, ఇంటిలిజెంట్ ఘోరమైన డిజాస్టర్లు. ఇక ఖైదీ నెంబర్ 150 రీమేక్ సినిమా.. ఆ సినిమాతో వినాయక్‌కు పేరు రాలేదు. ఇక సాయిధరమ్ తేజ్‌తో వినాయక్ తీసిన ఇంటిలిజెంట్ సినిమా తర్వాత అసలు వినాయక్ డైరెక్షన్ మర్చిపోయాడన్న విమర్శలు వచ్చేశాయి. ఇక దర్శకుడిగా గ్యాప్ తీసుకున్న వినాయక్ మధ్యలో హీరో అవతారం ఎత్తారు.
వినాయక్ హీరోగా మారి ‘శీనయ్య’ అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో పాటు ఈ సినిమా డైరెక్టర్ శంకర్ అసిస్టెంట్ కావడంతో ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఇక వినాయక్ సైతం ఈ సినిమా కోసమే బాగా సన్నబడ్డాడు. ఫస్ట్ లుక్కు కూడా మంచి రెస్సాన్సే వచ్చింది. ఇక శీనయ్య టైటిల్ పాతగానే ఉన్నా దిల్ రాజు, వినాయక్, శంకర్ శిష్యుడు డైరెక్టర్ కావడంతో కొంచెం హైప్ వచ్చింది. ఇక ఈ సినిమా కథ విన్నప్పుడు, తెరపైకి వచ్చాక అవుట్‌ఫుట్ చూస్తే చాలా డిజప్పాయింట్ అనిపించిందట దిల్ రాజుకు.
ఇక ఈ సినిమా దర్శకుడు నరసింహారావుకు కూడా సినిమా బాగా రాలేదని అనిపించడంత సినిమా ఆపేశాడంటున్నారు. ఇక ఇప్పట్లో ఈ సినిమా బయటకు వచ్చే అవకాశమే లేదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదే జరిగితే చివరకు హీరోగా అయినా అదృష్టం పరీక్షించుకోవాలనుకున్న వినాయక్‌కు ఇది పెద్ద షాకే అనుకోవాలి. ఇక ఇప్పుడు వినాయక్‌కు మళ్లీ చిరు లూసీఫర్ రీమేక్ చేసే ఛాన్స్ వచ్చిందంటున్నారు. మరి ఈ సినిమా అయినా హిట్ అయితే వినాయక్‌కు లైఫ్ ఉంటుంది.. లేకపోతే వినాయక్‌ను ఇండస్ట్రీ మర్చిపోయినట్టే అనుకోవాలి.