తెలుగు బుల్లితెర రంగంలో ఎంతో మంది మహిళా యాంకర్లు ఉన్నా కూడా అనసేయ క్రేజే వేరు. అప్పుడెప్పుడో పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నా ఇప్పటకీ తన గ్లామర్ కాపాడుకుంటూ వస్తోంది. ఇక కుర్రాళ్లకు ఆమె ఇప్పటకీ రంగమ్మత్తే. ఇదిలా ఉంటే ఇటీవల ఆలీ షోలో పాల్గొన్న అనసూయ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నా బలుపు.. నా పొగరు అని తనే చెప్పుకున్న ఆమె తనపై ట్రోల్ చేసే ట్రోలర్స్‌కు ఓ ఘాటు హెచ్చరిక జారీ చేసింది.
ట్రోలర్స్‌కు మాత్రమే కాదు.. యూట్యూబ్ ఛానెల్స్‌కు, సైట్లకు కూడా ఈ హెచ్చరికలు పంపింది. ఎవరైనా తన గురించి పిచ్చి పిచ్చిగా రాస్తే తాట తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చెత్త రాతలను ఎంత మాత్రం సహించనని ఖరాఖండీగా చెప్పేసింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే అనసూయ యాంటీ ట్రోల్ ఫైటర్. ఎవరైనా సెలబ్రిటీలు తమ గురించి రాస్తే సైలెంట్ అయిపోతారు.. వీళ్లతో మనకెందుకు అనుకుంటారు. కానీ అనసూయ మాత్రం ఈ విషయంలో తలెగరేసి మరీ సమాధానం ఇస్తుంది.
వివాదాలు రావా అంటే అయినా ఆమె ఎక్కడా వెనక్కు తగ్గదు. తాను ఎక్కడా తగ్గకుండానే సమాధానం ఇస్తుంది. దీనిపై మరింత ప్రచారం ఆమెకే ప్లస్ అవుతుంది. అసలు అనసూయపై ఏదో ఒక ప్రచారం లేకుండా మన నెటిజనం ఖాళీగా ఉన్నదెప్పుడు.. !