Moviesబిగ్‌బాస్ 4లో ఆ సింగ‌ర్ భ‌ర్త క‌న్‌ఫార్మ్‌.. ర‌చ్చ ర‌చ్చే అంటూ...

బిగ్‌బాస్ 4లో ఆ సింగ‌ర్ భ‌ర్త క‌న్‌ఫార్మ్‌.. ర‌చ్చ ర‌చ్చే అంటూ పోస్ట్‌

తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ 4 ఈ నెల చివ‌రి నుంచి ప్రారంభం కాబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవ‌రు అయితే ఉన్నారో ఇప్పుడు వారంతా హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఇక నెట్‌లో సైతం బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనంటూ ఓ లిస్ట్ చ‌క్కెర్లు కొడుతున్నా దీనిపై అధికారిక వార్త అయితే షో ప్రారంభ‌మ‌య్యే వ‌ర‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇదిలా ఉంటే టాలీవుడ్ నటుడు నందు తెలుగు బిగ్ బాస్ సీజన్-4 లో పాల్గొంటున్నట్టు లీక్ చేసేశాడు. ఇక నందు భార్య సింగ‌ర్‌ గీతామాధురి బిగ్‌బాస్ 2లో కంటెస్టెంట్‌.

నందు  ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పాడు. బిగ్‌బాస్‌లో త‌న జ‌ర్నీ కంటిన్యూ చేసేందుకు త‌న‌కు మీ పూర్తి మ‌ద్ద‌తు కావాల‌ని కూడా చెప్పాడు. ఇప్ప‌టికే నెట్లో వైర‌ల్ అవుతోన్న లిస్టులో నందు పేరు కూడా ఉంది. ఇప్పుడు నందు ఈ విష‌యాన్ని లీక్ చేయ‌డంతో నందు బిగ్‌బాస్ 4 హౌస్‌లోకి ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చింది. దీనిపై నందు ఇన్‌స్టాగ్రామ్‌లో డార్లింగ్స్ నేను బీబీలో వ‌స్తున్నా.. బీబీలో మ‌న ర‌చ్చ మామూలుగా ఉండ‌దు… మీకు మ‌రింత వినోదం పంచుతాన‌ని.. మీకు నా మ‌ద్ద‌తు కావాల‌ని చెప్పాడు.

ఇక మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు కూడా చెప్పేందుకు రెడీగా ఉన్నాయ‌న్నా.. అవేంటో మాత్రం చెప్ప‌నేలేదు. ఇక బిగ్‌బాస్ ఈ నెల చివ‌రి నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని.. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు, 105 రోజులు, 106 ఎపిసోడ్ల‌తో అదిరిపోనుంద‌ని తెలుస్తోంది. ఈ సారి గ్లామ‌ర్‌కు కూడా కొద‌వ‌లేదంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news