ముదురు ముద్దుగుమ్మ అనుష్క వయస్సు 40కు చేరువు అవుతున్నా ఆమె పెళ్లి ఊసే ఎత్తడం లేదు. మరోవైపు ఆమె పెళ్లి గురించి రూమర్లు ఎక్కువ అవుతున్నాయి. అసలు అనుష్కకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా ? లేదా ? అన్నది కూడా తెలియడం లేదు. ఇంత వయస్సు వచ్చినా పెళ్లి మాట ఎత్తని అనుష్క ఇప్పటకీ కూడా ఎన్ని సినిమా ఛాన్సులు వచ్చినా చేసేందుకు రెడీగానే ఉంది. ఇక ఇప్పట్లో అనుష్క పెళ్లిపై పుకార్లు రావడమే కాని ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనట్టే ఉంది.
ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాలో నటిస్తోన్న ఆమె ఇంకా ఛాన్సులు వస్తే చేసేందుకు రెడీగానే ఉంది. ఇక ఇప్పుడు మరో ముదురు ముద్దుగుమ్మ కాజల్ సైతం అనుష్కనే ఫాలో అవ్వనుందా ? అంటే ఇండస్ట్రీలో అవునన్న గుసగుసలే వినిపిస్తున్నాయి. కొద్ది నెలల నుంచి ముదురు హీరోయిన్ కాజల్ కి ఎంగేజ్మెంట్ అయ్యిందని ప్రచారం జరుగుతోని. బిజినెస్ మెన్ గౌతమ్‌తో ఆమె పెళ్లి జరగుతుందని వార్తలు వస్తున్నా అవేవి అధికారికంగా రివీల్ అవ్వలేదు.
ప్రస్తుతం చిరంజీవి పక్కన ఆచార్య సినిమా చేస్తోన్న ఆమె కూడా పెళ్లి అయితే వచ్చే ఒకటి రెండు అవకాశాలు కూడా రావని… మరి కొంత కాలం కెరీర్ కొనసాగిద్దాం.. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం ? అన్న ఆలోచనలో ఉందట. కాజల్ ఎంగేజ్మెంట్ వార్తలు అంతా నిజం కాదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేవని అంటున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు ముదురు ముద్దుగుమ్మల పెళ్లి వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు.