గత రెండు సంవత్సరాలుగా కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాడ్యం మాదిరిగా మారిపోయింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ధైర్యంగా బయటకు వచ్చి మరీ కాస్టింగ్ కౌచ్ గురించి చెపుతున్నారు. తాము ఎవరి వల్ల ఎలా ఇబ్బందులు పడ్డామో చెపుతున్నారు. ఇవి పెద్ద కాంట్రవర్సీలుగా మారుతున్నాయి. ఇక స్టార్ హీరోయిన్ అయిన స్వీటీ బ్యూటీ అనుష్క సైతం తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని ఓపెన్ అయిపోయింది.
ఇక నటి శ్రీ రెడ్డి ఈ విషయమై పెద్ద ఉద్యమమే లేవనెత్తి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ తర్వాత వరుసపెట్టి పలువురు హీరోయిన్లు తాము కాస్టింగ్ కౌచ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో చెప్పారు. తాజాగా అనుష్క తాను నటించిన నిశ్శబ్దం సినిమా ప్రమోషన్లో మాట్లాడుతూ తాను కూడా ఇండస్ట్రీలో కొందరి వల్ల వేధింపులకు గురయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇక ఇదంతా కామన్ అని చెప్పిన అనుష్క… టాలీవుడ్‌లోనూ ఇది ఉందని ఆమె పేర్కొంది. తాను ముక్కుసూటితనంతో వ్యవహరించడంతో పాటు ధైర్యంగా ఉండడంతో క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగానని ఆమె తెలిపింది. ఇక అనుష్క లాంటి స్టార్ హీరోయిన్‌కే వేధింపులు తప్పలేదంటే మిగిలిన హీరోయిన్ల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.