ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆన్‌లైన్ ద్వారా ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా పోటీ నిర్వహించింది. ఈ పోటీలో ఇండియన్ సినిమా స్టార్స్‌తో పాటు స్టార్ క్రికెటర్లను కూడా తీసుకుంది. 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారి జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచి వీరిలో మోస్ట్ డిజైరబుల్ మెన్‌కు ఆన్‌లైన్ ద్వారా ఓట్లు వేయాలని కోరింది. ఈ జాబితాలో మన టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇంకా మరికొంత మంది హీరోలు కూడా ఉన్నారు.
అక్కడి వరకు బాగానే ఉంది. అయితే బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌లు మొదటి, రెండవ స్థానాలలో నిలిచారు. మూడో స్థానంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు. ఓవరాల్‌గా టాప్ -10లో మన తెలుగు హీరోల్లో ఒక్క విజయ్ దేవరకొండ మాత్రమే టాప్ 10లో ఉన్నాడు. ఈ లిస్ట్‌పై సోషల్ మీడియాలో టాప్ హీరోల అభిమానులు విరుచుకుపడుతున్నారు. తమ హీరోలకు టాప్ -10 జాబితాలో చోటు ఎందుకు దక్కలేదని.. అసలు ఇందంతా నిజం కాదని కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల విజయ్ నటించిన నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ రెండు డిజాస్టర్లు అయినా కూడా విజయ్‌కే ఏకంగా జాతీయ స్థాయిలో మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్‌గా టాప్-3లో ఎలా చోటు దక్కిందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు కారణమైంది. ఇక విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.