సోషల్ మీడియా ఎక్కువయ్యాక ఆకతాయిల వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు మరీ శృతిమించి వ్యవహరిస్తున్నారు. కొందరు ఏకంగా హీరోయిన్లనే టార్గెట్గా చేసుకుని వేధిస్తున్నారు. మరి కొందరు హీరోయిన్ల ఫొటోలు మార్పింగ్ చేసి ఇష్టమొచ్చినట్టు పోర్న్ సైట్లలో పెడుతున్నారు. ఇలా వీరి వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే ఓ 27 ఏళ్ల యువకుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను టార్గెట్గా చేసుకున్నాడు.
సోషల్ మీడియా వేదికగా సోనాక్షిని అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో ఆమె ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ముంబై సైబర్ క్రైం పోలీసులు ఆ 27 ఏళ్ళ యువకుడిని అరెస్టు చేశారు. తనపై వేధింపులకు పాల్పడ్డ వారిపై ముంబై సైబర్ పోలీసులు తీసుకున్న చర్యలకు సోనాక్షి ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఆన్లైన్ ప్రపంచం సురక్షితంగా ఉండేవారకు తాను మాత్రం నిశ్శబ్దంగా ఉండను అని చెప్పిన సోనాక్షి.. అందుకే తాను పడిన బాధ మరెవ్వరు పడకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. తాను ఫిర్యాదు చేసిన వెంటనే ముంబై సైబర్ క్రైం పోలీసులు చర్యలు తీసుకున్నారు, వారికి అభినందనలు అంటూ ఆమె రిప్లే ఇచ్చింది. ఏదేమైనా సోనాక్షి ధైర్యాన్ని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు.