ఈ హెడ్డింగ్ షాకింగ్‌గానే ఉండొచ్చు.. కానీ ఇది నిజమే అన్న గుసగుసలు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో గత నాలుగైదు రోజులుగా గుప్పుమంటున్నాయి. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతానికి క్యాన్సిల్ అయినట్టే.. అయితే పూర్తిగా క్యాన్సిల్ అయినట్టు కాదు.. వాయిదా పడినట్టే అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌ను రాజమౌళి ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో కూడా తెలియని పరిస్థితి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలు వచ్చే యేడాది కూడా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనపడడం లేదంటున్నారు.
ఇంకా పెండింగ్ ఉన్న 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేశాక… పోస్ట్ ప్రొడక్షన్ ఇతరత్రా పనులకే మరో యేడాది సమయం పట్టవచ్చని అంటున్నారు. అందుకే అప్పటి వరకు ఎన్టీఆర్ కోసం వెయిట్ చేయడం కన్నా ఈ లోగా వెంకటేష్‌తో మూడు నెలల్లోనే ఓ సినిమా కంప్లీట్ చేసేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. వెంకీ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్యాప్‌లోనే వెంకీతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఫినిష్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.
ప్రస్తుతం నారప్ప సినిమా చేస్తోన్న వెంకీ దానిని త్వరలోనే ఫినిష్ చేయనున్నాడు. ఆ వెంటనే వెంకీ – త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లేట్ అవ్వడంతో టాలీవుడ్లో చాలా సినిమాల షెడ్యూల్స్ మారిపోనున్నాయి. చాలా చిత్ర విచిత్రాలు జరగనున్నాయి. అటు ఆర్ఆర్ఆర్ నుంచి బైటపడలేక ఎన్టీఆర్ కూడా ఇబ్బంది పడుతున్నారని సమాచారం.