Sportsపెళ్లికొడుకు అవుతోన్న టీం ఇండియా క్రికెట‌ర్‌... భార్య ఎవ‌రో తెలుసా..

పెళ్లికొడుకు అవుతోన్న టీం ఇండియా క్రికెట‌ర్‌… భార్య ఎవ‌రో తెలుసా..

భార‌త క్రికెట్ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ త్వ‌ర‌లోనే పెళ్లి పీఠ‌లు ఎక్క‌బోతున్నాడు. గురువారం త‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న ఎంగేజ్మెంట్ విష‌యాన్ని పంచుకోవ‌డంతో పాటు త‌న‌కు కాబోయే శ్రీమ‌తి ఫొటోలు కూడా పోస్ట్ చేశాడు. విజ‌య్ శంక‌ర్‌కు వైశాలి విశ్వేశ్వ‌ర‌న్ అనే యువ‌తితో ఎంగేజ్మెంట్ జ‌రిగింది. విజ‌య్ శంక‌ర్ ఎంగేజ్మెంట్ జ‌ర‌గిన వెంట‌నే స‌హ‌చ‌ర క్రికెట‌ర్లు కేఎల్‌. రాహుల్‌, య‌జ్వేంద్ర చాహాల్‌, శ్రేయాస్ అయ్య‌ర్‌, క‌ర‌ణ్ నాయ‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

 

2018లో కొలంబోలో శ్రీలంక‌తో జ‌రిగిన టీ మ్యాచ్ ద్వారా విజ‌య్ శంక‌ర్ తొలిసారి అంత‌ర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌య్ శంక‌ర్ 12 టెస్టులు, 9 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సంవ‌త్స‌రం ఐపీఎల్‌లో విజ‌య్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడ‌నున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news