హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత ఇటీవల వరుసగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో ఉంటున్నారు. ఆమె మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండడంతో పాటు ఏదో ఒక వివాద వ్యాఖ్యలు చేస్తూ ఇరుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన ఫేస్బుక్లో పెట్టిన కామెంట్ ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.
ఆమె పెట్టిన పోస్టు హిందువుల మనోభవాలు దెబ్బతీసే విధంగా ఉందని.. హైదరాబాద్లోని వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే స్టూడెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై రాచకొండ సైబర్ పోలీసులు స్పందించారు. ఈ క్రమంలోనే పోలీసులు మాధవీలతపై 295-A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.