Politicsగాలి ద్వారా క‌రోనా... భ‌యంక‌ర నిజం

గాలి ద్వారా క‌రోనా… భ‌యంక‌ర నిజం

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా గాలి ద్వారా కూడా వ‌స్తుందా ? ఇది ఎప్ప‌టి నుంచో వినిపిస్తోన్న ప్ర‌శ్న‌. ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజీ నిపుణుల ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం గాలి ద్వారా కూడా క‌రోనా 4.8 మీట‌ర్ల వ‌ర‌కు వ్యాపిస్తుంద‌ని చెపుతున్నారు. ప్ర‌స్తుతం పాటిస్తోన్న భౌతిక దూరం ఎంత మాత్రం స‌రిపోద‌ని వీరు చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ విష‌యంలో ఉన్న రూల్స్ కూడా మార్చాల‌ని వీరు సూచిస్తున్నారు. గాలి ద్వారా కూడా క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌ని త‌మ ప‌రిశోధ‌నల్లో తేలింద‌ని.. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఉన్న రూల్స్‌తో క‌రోనా క‌ట్ట‌డిలోకి రాద‌ని.. వైరస్ వ్యాప్తి, క్లస్టర్లను అడ్డుకోవాలంటే ఇప్పుడున్న మార్గదర్శకాలను మార్చాలని వారు సూచించారు.

 

ఇక మాట్లాడుతున్న‌ప్పుడు, తుమ్ములు, ద‌గ్గు ద్వారా వ‌చ్చే చిన్న తుంప‌ర్ల నుంచి గాలిలో ప్ర‌యాణించే వైర‌స్ నోరు, ముక్కు, గొంతు, నోరు, క‌ళ్ల ద్వారా మ‌నుష్యుల‌కు వ్యాప్తి చెందుతుంద‌ని వీరు చెపుతున్నారు. వీరి మాట ఇలా ఉంటే గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదించింది. వివిధ దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు తమ వద్ద ఆధారాలు ఉన్నయాని లేఖ రాయడంతో తాజాగా అంగీకరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news