Gossipsఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ సినిమా...!

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ సినిమా…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌కు క‌మిట్ అయ్యాడ‌ని… మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ సినిమా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ప్ర‌శాంత్ నీల్‌, ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఉంటుంద‌న్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోమే మైత్రీ వాళ్లు భారీ అడ్వాన్స్‌తో ప్ర‌శాంత్‌ను లాక్ చేశార‌ని… ప్ర‌శాంత్ ఎన్టీఆర్‌కు మెయిన్ లైన్ చెప్పి క‌థ‌ను ఓకే చేయించుకున్నార‌ని టాక్‌..?

 

ఇక ఈ సినిమా మెయిన్ లైన్ కేజీఎఫ్ స్టైల్లోనే భారీ యాక్షన్‌ థ్రిల్లర్ గా ఉండ‌బోతోంద‌ట‌. అయితే ఇప్పుడు మ‌రో వార్త ప్ర‌శాంత్ గురించి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్టీఆర్ కంటే నీల్ ముందు ప్ర‌భాస్ సినిమా చేస్తాడ‌ని అంటున్నారు. కేజీఎఫ్ కంటే ముందు ప్ర‌శాంత్ ఉగ్రం సినిమా తీశారు. ఆ సినిమా రిలీజ్ అయిన‌ప్పుడే నీల్ ప్రభాస్‌ను ఒకసారి కలిసి సినిమా విషయమై చర్చలు జరిపారట. అయితే అప్పుడు నీల్‌పై ప్ర‌భాస్‌కు అంత గురి కుద‌ర్లేద‌ట‌. ఎప్పుడు అయితే కేజీఎఫ్ వ‌చ్చిందో… ప్ర‌శాంత్ నేష‌న‌ల్ క్రేజ్ తెచ్చుకున్నాడో ప్ర‌శాంత్‌తో సినిమా చేయాల‌ని ప్ర‌భాస్ బ‌లంగా ఫిక్స్ అయిపోయాడ‌ట‌.

 

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మ‌హాన‌టి ఫేం నాగ్‌ అశ్విన్‌తో మరో సినిమా చేయనున్నారు. వైజ‌యంతీ మూవీస్ తెర‌కెక్కించే ఈ సినిమా ప్ర‌భాస్ కెరీర్‌లో 21వ సినిమా. ఈ సినిమా త‌ర్వాతే ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంద‌ని… 2022 నుంచి ఈ సినిమా షూటింగ్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని అంటున్నారు. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేక‌ర్సే నిర్మించ‌నున్నార‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news