ప్రముఖ షార్ట్ వీడియో మెసేజింగ్ యాప్ టిక్‌టాక్ విషయంలో రోజుకో ఆసక్తికర వార్త వెలుగులోకి వస్తోంది. ముందుగా ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ దీనిని కొనుగోలు చేస్తోందని వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం సెప్టెంబర్ 15వ తేదీలోగా టిక్‌టాక్ కొనుగోలును ఆయా సంస్థలు కంప్లీట్ చేయాల్సి ఉంది. మరోవైపు ట్రంప్ వార్నింగ్‌పై స్పందించిన చైనా సైతం టిక్‌టాక్‌ను కబలించేందుకు ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాలు అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు టిక్‌టాక్ సీఈవో కెవిన్ మయర్ తాజాగా రిలయన్స్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశం కావడంతో టిక్ టాక్ – రిలయన్స్ మధ్య చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది.
టిక్‌టాక్ విలువ 2.5 నుంచి 5 బిలియన్ల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌తో పాటు కొన్ని దేశాల్లో టిక్‌టాక్‌ను నిషేధించడంతో టిక్ టాక్ విలువ తగ్గింది.. మరి కొద్ది రోజులు ఆగితే దీనివిలువ మరింత తగ్గితే అప్పుడు దీనిని కొనుగోలు చేయవచ్చన్న ఆలోచనలో రిలయన్స్ ఉందట. మరోవైపు మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్‌కు చెందిన ఇండియా బిజినెస్‌తోపాటు ప్రపంచ వ్యాప్త బిజినెస్‌ను కొనాలని చూస్తోంది.
ఇక భారత్‌లో టిక్‌టాక్ బిజినెస్ పెద్దది కావడంతో ఇక్కడ రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు లేకపోవడంతో ఇక్కడ వాటాను అయినా అమ్మాలని టిక్ టాక్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరి రిలయన్స్ చేతికి టిక్ టాక్ వస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.