ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ రోజు రోజుకు శరవేగంగా విజృంభిస్తోంది. దేశంలో సగటున రోజుకు 50 నుంచి 60 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇక కరోనా నుంచి కోలుకున్న వారు తిరిగి మళ్లీ కరోనా భారీన పడుతున్నారు. తాజాగా ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు బాధితులు తిరిగి కరోనా భారీన పడ్డారు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో చికిత్స తీసుకుని కోలుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు ఇంటికి వచ్చాక మళ్లీ కరోనా భారీన పడ్డారు. దీంతో ఆసుపత్రి వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.
కరోనా రిపోర్టుల్లో ఏమైనా తప్పులు దొర్లాయా ? లేదా ? అసలు ఏం జరిగింది ? అన్నది మాత్రం అర్థం కావడం లేదు. అయితే తాజా పరిశోధనల్లో ఒక్క విషయం మాత్రం తేలిందంటున్నారు. ఈ వైరస్ నుంచి కోలుకున్నా కూడా కపంలో ఇది మరో 39 రోజులు జీవించే ఉంటుందట. ఏదేమైనా కరోనా నుంచి కోలుకున్నాక తిరిగి మళ్లీ పాజిటివ్ రావడం ఆందోళన కలిగించే విషయమే. ఇలాంటి వారికి భవిష్యత్తులో ఇతర ప్రమాదాలు కూడా ఎక్కువగానే సంభవించే అవకాశం ఉందని అంటున్నారు.