హైద‌రాబాద్‌లో 14 ఏళ్ల‌ బాలిక మృతి వెన‌క క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు… కూల్ డ్రింక్ ఇచ్చి.. !

హైద‌రాబాద్‌లో మృతిచెందిన 14 ఏళ్ల అనాథ బాలిక మర‌ణం వెన‌క క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. త‌ల్లిదండ్రులు లేని 14 ఏళ్ల బాలిక అమీన్‌పూర్‌లో ఓ ప్రైవేటు అనాథ శ‌ర‌ణాల‌యంలో ఉంటూ చ‌దువుతోంది. లాక్‌డౌన్ వ‌ల్ల ఆమె న్యూ బోయిన్ పల్లిలోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అనారోగ్యంగా ఉన్న ఆ బాలికను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చూపించ‌గా డాక్ట‌ర్ ఆమె లైంగీక దాడికి గురైంద‌ని చెప్ప‌డంతో వాళ్లు షాక్ అయ్యారు. బాలిక‌ను అడ‌గ‌గా ఆమె ఆశ్ర‌యానికి విరాళం ఇచ్చిన దాత వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వార్డెన్ త‌న‌ను బ‌ల‌వంతంగా ఐదో అంత‌స్తుకు పంపేవాడ‌ని… కూల్ డ్రింక్ తాగిన వెంట‌నే తాను మైకంలోకి వెళ్లిపోయేదాన‌ని చెప్పింది.

 

ఒక్కోసారి మెల‌కువ వ‌చ్చేస‌రికి ఒంటిమీద బ‌ట్ట‌లు కూడా ఉండేవి కావ‌ని… ఈ విష‌యాలు ఎవ‌రికి అయినా చెపితే చంపేస్తాన‌ని వార్డెన్ బెదిరించేవాడ‌ని ఆ బాలిక ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇక ఆసుప‌త్రిలో చేర్పించే స‌రికే ఆమె ప‌రిస్థితి విష‌మించ‌గా నీలోఫ‌ర్‌కు పంపారు. అక్క‌డ చికిత్స అందిస్తుండ‌గానే ఆమె మృతి చెందింది. మైన‌ర్ బాలిక‌పై లైంగికదాడికి కారణమైన అనాధ ఆశ్రమ నిర్వాహకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఏదేమైనా దాత ముసుగులో ఉన్న ఓ కామాంధుడి కోరిక‌ల‌కు ఓ మైన‌ర్ బాలిక బ‌లైపోవ‌డం చూస్తే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో ? అర్థ‌మ‌వుతోంది.

Leave a comment