ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా హడావిడి కొనసాగుతోన్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఎక్కడ చూసినా కరోనా గురించిన రాంగ్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే కొందరు యూజర్లు స్ప్రెడ్ చేస్తోన్న రాంగ్ పోస్టులు అన్నింటిని ఫేస్‌బుక్ తొలగించింది. మొత్తం 70 లక్షల పోస్టులు తొలగించినట్టు ఫేస్‌బుక్ తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ పోస్టులు డిలీట్ అయ్యాయి.
ఈ యేడాది జనవరి టు మార్చి మధ్య 9.6 మిలియన్ల హేట్ న్యూస్, రెండో త్రైమాసికంలో 8.7 మిలియన్లు తొలగించారు. రెండో త్రైమాసికంలో తొలగించిన పోస్టుల్లో చాలా వరకు టెర్రరిస్టు ఆర్గనైజేష్‌కు చెందనివని సమాచారం. ఈ హేట్ న్యూస్‌ను గుర్తించి తొలగించేందుకు ఫేస్‌బుక్ యాజమాన్యం ఆటోమేషన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అన్ని పోస్టులను మాన్యువల్ గా గుర్తించి డిలీట్ చేయడం కష్టం కాబట్టే ఈ ఆటోమేటిక్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు.
ఇక తమ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ప్రజలకు మంచి చేయాలని.. అందువల్ల ఫేక్ వార్తలు, హింసను, అశ్లీలతను ప్రేరేపించే పోస్టులకు ఇక్కడ చోటు లేదని.. అలాంటి పోస్టులను డిలీట్ చేసి.. ఆ యూజర్ల చర్యలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించింది. సో ఇక యూజర్లు చెత్త పోస్టులు పెట్టాలంటే వారి పప్పులు ఉడకవ్.