ఎన్టీఆర్‌తో ఒక్క ఛాన్స్ కోసం స్టార్ డైరెక్ట‌ర్ వెయిటింగ్‌…. ఆ ల‌క్ చిక్కేనా…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో నటిస్తాడు. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ సినిమా కూడా ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తాడ‌ని.. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ సైతం ఎన్టీఆర్ కోసం క‌థ రెడీ చేస్తున్నాడ‌ని… మెయిన్ లైన్ దాదాపు ఓకే అయ్యింద‌ని అంటున్నారు.

 

ఇక ఎన్టీఆర్ – కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తుంద‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌పై గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే అట్లీ ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌కు ఎన్టీఆర్ అంటే ఇష్ట‌మ‌ని.. ఆయ‌న‌తో ఒక్క సినిమా చేయాల‌ని క‌ల‌లు కంటున్నాన‌ని చెప్పాడు. ఎప్ప‌ట‌కి అయినా ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాన‌ని కూడా అట్లీ ప్ర‌క‌టించాడు.

 

ఇక అట్లీ సినిమాలు రిలీజ్ అయితే వాటిని చూసిన వెంట‌నే ఎన్టీఆర్ త‌న‌కు కాల్ చేసి.. త‌న అభిప్రాయం పంచుకుంటార‌ని.. ఆయ‌న చూపించే ప్రోత్సాహం, ప్రేమ బాగుంటుంద‌ని కూడా ఇటీవ‌ల చెప్పాడు. ఇక ఎన్టీఆర్‌తో ఛాన్స్ వ‌స్తే జీవితంలో ఆయ‌నతో పాటు ఆయ‌న అభిమానులు ఎప్ప‌ట‌కీ గుర్తుండిపోయే సినిమా తీస్తాన‌ని కూడా చెప్పాడు. మ‌రి అట్లీకి ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ ఎప్పుడు చిక్కుతుందో ? చూడాలి.

Leave a comment