పెళ్లయ్యి భర్తతో ఎంచక్కా సంసారం చేసుకుంటోన్న ఓ మహిళకు ఐదేళ్ల కుమార్తె ఉన్నా కూడా ప్రియుడి మోజులో పడి అతడితో పరారైంది. ఈ క్రమంలోనే తన భర్తనే ఇరికించేందుకు అదిరిపోయే స్కెచ్ వేసింది. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాజధని బెంగళూరు సమీపంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ( 32) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఎనిమిది సంవత్సరాల క్రితం ఓ మహిళతో వివాహం కాగా ఈ దంపతులకు ఐదేళ్ల కుమార్తె ఉంది.
మూడు రోజుల క్రితం ఆమె కుటుంబ సలహా కేంద్రానికి ఫోన్ చేసి తనను భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ సలహా కేంద్రం సభ్యులు ఆమె భర్త ఫోన్ నెంబర్ సేకరించి అతడికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయగా అతడు ఇచ్చిన ఆన్సర్‌తో వారికి షాక్ కొట్టినంత పనైంది. తన భార్య పది రోజులుగా కనిపించడం లేదని.. దీనిపై తాను ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పాడు. దీనిపై పోలీసులు లోతుగా విచారించగా ఆ భార్యామణి చేసిన బాగోతం బయట పడింది.
ఆమె కొంత కాలం క్రితం స్నేహితులతో కలిసి పిక్నిక్కు వెళ్లింది. అక్కడ ఓ యువకుడితో పరిచయం ఏర్పడడం.. రోజా వాట్సాప్ మెసేజ్‌లు, వీడియో కాలింగ్స్‌తో దగ్గరయ్యారు. చివరకు ఆమె భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. భర్త భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అత్తిబెళ ప్రాంతంలో మరో వ్యక్తితో ఉన్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకుని కుటుంబ సలహా కేంద్రంలో ఆమెను అప్పగించారు.
భర్తను జైలుకు పంపేందుకే తాను ఈ నాటకం ఆడానని చెప్పిన సదరు భార్య, తాను భర్తతో కాపురం చేయనని.. ప్రియుడితోనే ఉంటానని ఆమె చెప్పడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఆమెకు నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.