రాజధాని రగడ: ఉపఎన్నికలు వస్తే టీడీపీకి ప్లస్ అయ్యేది ఎక్కడ..?

మూడు రాజధానుల అంశం ఏపీ రాజకీయాలని కుదిపేస్తోంది. మూడు రాజధానులకు మద్ధతుగా అధికార వైసీపీ సంబరాలు చేసుకుంటుంటే, అమరావతికి మద్ధతుగా ప్రతిపక్ష టీడీపీ ఆందోళనలు చేస్తోంది. ఇదే సమయంలో మూడు రాజధానులకు మద్ధతుగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసుకుని మళ్ళీ ఎన్నికల బరిలో దిగాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ఎన్నికల ముందు అమరావతి నుంచి రాజధాని తరలిస్తానని చెప్పలేదని, కాబట్టి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని, ఇక దీనిపై ఏ విషయం చెప్పాలని చంద్రబాబు జగన్ ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చారు.

 

ఇక 48 గంటల తర్వాత చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారా అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకవేళ ఉపఎన్నికలు వస్తే పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉంటుందా? అనే విశ్లేషణ కూడా నడుస్తోంది. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేస్తే, ఉపఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ తిరిగి గెలుస్తారని తెలుస్తోంది. ఆఖరికి విశాఖ నగరంలో కూడా టీడీపీ బలం తగ్గలేదని, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంచి సత్తా గల నాయకులు అని, వారు గెలవగలరని అంటున్నారు. విశాఖ‌లో వైఎస్సార్‌సీపీ ఒక‌రిద్ద‌రు నాయ‌కుల‌ను బ‌లంగా లాక్కున్నా ఆ పార్టీకి ఉన్న సంస్థాగ‌త బ‌లం మాత్రం అలాగే ఉంద‌ని అంటున్నారు. సో ఈ లెక్క‌న వైసీపీ విశాఖ‌లో క్షేత్ర‌స్థాయిలో టీడీపీని నిలువ‌రించ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంది.

 

అయితే మూడు రాజధానులకు మద్ధతుగా కృష్ణా-గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్ అన్నీ వైపుల నుంచి పెరుగుతోంది. కానీ ఎంత డిమాండ్ వచ్చినా…వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయరని తెలుస్తోంది. ఎందుకంటే వారు గనుక మూడు రాజధానులకు మద్ధతుగా రాజీనామా చేస్తే, మళ్ళీ మెజారిటీ ఎమ్మెల్యేలు తిరిగి గెలవడం కష్టమని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ రెండు జిల్లాల్లో చాలా మంది ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ఎమ్మెల్యేలు రాజీనామా అన్న మాట వింటేనే వ‌ణుకుతోన్న ప‌రిస్థితి ఉంది. మరి చూడాలి ఈ మూడు రాజధానుల రగడ ఎంతవరకు జరుగుతుందో… ఎలా ట‌ర్న్ అవుతుందో ?

Leave a comment