ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రైల్ రన్ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో సక్సెస్ అయ్యింది. గత కొద్ది నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ ఒక్క దేశం వ్యాక్సిన్ రెడీ చేసినా దానిని లాక్కు పోయేందుకు ఎన్నో దేశాలు వెయిట్ చేస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ మినహా వేరే మార్గం లేదన్నదానిపై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం అనేక రకాల పరిశోధనలు చేస్తున్నా ఏవి ఇప్పటి వరకు ఫైనలైజ్ కాలేదు. అయితే ఈ పరిశోధనల నేపథ్యంలో ఓ అదిరిపోయే న్యూస్ వచ్చింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తోన్న సంస్థల్లో భారత్ బయోటెక్ ఒకటి. ఇది హైదరాబాద్ జినోమ్ వ్యాలీ కేంద్రంగా వ్యాక్సిన్ తయారు చేస్తోంది.
ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 12 కేంద్రాల్లో ట్రయల్స్ వేస్తున్నారు. తాజాగా నిమ్స్‌లో వేసిన ఫేజ్ 1 క్లీనికల్ ట్రయల్స్ ముగిశాయి. మొత్తం 60 మంది వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన నిమ్స్ బృందం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని చేసిన ప్రకటనతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే వ్యాక్సిన్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెపుతోంది.