బాహుబలి సిరీస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ `సాహో` సినిమా చేస్తున్నాడు. బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్ అయిపోయాడు. తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చూపించాడు. స్టార్‌గా తన ఇమేజ్ను ఊహించని స్థాయికి చేర్చుకొన్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ సుజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ చిత్రాన్ని నిర్మిస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ప్రభాస్ సరసన నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ప్రభాస్ లుక్స్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను నెలకొనేలా చేశాయి. ఈ చిత్రంలో మందిరా బేడి, ఎవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్ వంటి బాలీవుడ్ తారలు నటిస్తుండటం విశేషం. అయితే తాజాగా `సాహో`కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అదేంటంటే సహజంగా స్టార్ హీరోల రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు అధికారికంగా బయటకు రానివ్వరు. సాహోకు సంబంధించి కూడా ఎలాంటి విషయం లేకపోయినా ప్రభాస్‌కు మాత్రం అదిరిపోయే రిమ్యూనరేషన్ ఉన్నట్టు సమాచారం. సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంటే.. అదే స్థాయిలో 150 కోట్ల రెమ్యూనరేషన్ ప్రభాస్‌కు ఉంటుందని టాక్.
అదే జరిగితే దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటులలో ప్రభాస్ ఒకరు అవుతారు. అలాగే టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాల కలెక్షన్ల కన్నా ప్రభాస్ రెమ్యూనరేషనే ఎక్కువ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సంచలనాలను సృష్టించబోతుంది. భారీ అంచనాలు ఉన్న ఈ హై బడ్జెట్ సినిమా ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.