Gossipsఅమ్మాయిలపై సెన్సేషన్ కామెంట్స్ చేసిన రానా.?

అమ్మాయిలపై సెన్సేషన్ కామెంట్స్ చేసిన రానా.?

దగ్గుబాటి వారసుడు రానా నాని జెర్సీ సక్సెస్ మీట్ లో తనకు అర్ధం కాని టాపిక్స్ గురించి ప్రస్థావించడం జరిగింది. తనకు క్రికెట్, అమ్మాయిలు, పెళ్లి పిల్లలు ఇవి అర్ధం కావు.. వాటిల్లో బేసిక్స్ కూడా తెలియవు. అయినా సరే అలాంటి వాడినైన నన్ను ఏడిపించేశాడు నాని. జెర్సీ సినిమ చూశాక తనకు కళ్ల నీల్లు తిరిగాయని అన్నాడు రానా. ఆదివారం జరిగిన జెర్సీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న రానా నాని మీద ప్రశంసలు కురిపించాడు.

నాని ప్రతిసారి తనకు సర్ ప్రైజ్ ఇస్తున్నాడని.. అంతేకాదు తనకు స్పూర్తిగా నిలుస్తున్నాడని అన్నారు. సినిమా దర్శకుడు గౌతం ఇదవరకు సినిమా చూశాను. సినిమా అద్భుతంగా తీశారని. శ్రద్ధ శ్రీనాథ్ కు తానో పెద్ద ఫ్యాన్ అని.. ఆమెకు తెలుగులో సూపర్ హిట్ తో గ్రాండ్ వెల్కం జరిగిందని అన్నారు రానా. ఇక సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తో కూడా సరదా సంభాషణలు సాగించాడు రానా.

మొత్తానికి రానా స్పీచ్ తో జెర్సీ సక్సెస్ మీట్ ఇంకాస్త జోరుగా జరిగింది. జెర్సీ సినిమా నాని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కూడా సినిమాకు బలాన్ని చేకూర్చింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసు తాకేలా ఈ సినిమా అందరి మనసులను గెలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news