Gossipsచెల్లితో పెళ్లా ? ఛీ ఛీ అంటూ మెగా హీరో ఫైర్...

చెల్లితో పెళ్లా ? ఛీ ఛీ అంటూ మెగా హీరో ఫైర్ !

మెగా హీరోలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా అందరిలోనూ ఎక్కడలేని ఆసక్తి కలిగిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో మెగా హీరోలంతా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా మెగా హీరో సాయి తేజ్ కూడా ఇప్పుడు ఓ విషయంలో మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. రీసెంట్ గా ‘చిత్రలహరి సినిమాతో మంచి హిట్ అందుకున్న సాయి తేజ్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ సందర్భంగా మీడియా కు ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్ లో బిజీ అయిపోయాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి కూడా సాయి తేజ్ ఓపెన్ గా మాట్లాడాడు. తన తల్లి రెండో పెళ్లిపై కూడా స్ట్రెయిట్ గా సమాధానం ఇచ్చాడు. ఇక తన పెళ్లిపై వస్తోన్న రూమర్లపై కూడా క్లారిటీ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా మెగా డాటర్ నీహారికతో సాయి తేజ్ పెళ్లి అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తుండడం పై ఈ యంగ్ హీరో ఫైర్ అయ్యాడు. నేను ప్రస్తుతం సినిమాల మీదే దృష్టంతా పెట్టాను తప్ప పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పుకొచ్చాడు.

ఈ మధ్య అనేక మీడియా ఛానెల్స్ లో తనకు నీహారికకు పెళ్లి అంటూ ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు రాస్తున్నారని, కానీ చిన్నప్పటి నుంచి నేను నీహారిక బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నామని చెప్పుకొచ్చాడు. వారిద్దరి మధ్య పెళ్లి అనే ఆలోచన ఎప్పుడూ రాలేదని అన్నారు. అయినా చెల్లిని పెళ్లి చేసుకోవడమేంటి..? ఛీఛీ ఇది చాలా వరస్ట్ అంటూ మండిపడ్డారు. అసలు ఇటువంటి గాసిప్స్ ఎలా రాస్తారని ? రాయడానికి కనీసం సిగ్గుండాలి కదా అంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఇంతకీ ఈ యంగ్ హీరో చెప్పొచ్చేది ఏంటి అంటే నిహారిక తనకు చెల్లి అని. ఇంకెప్పుడూ ఇటువంటి వార్తలు రాయొద్దని.అర్థమైంది కదా ఈ మెగా హీరో క్లారిటీ !

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news