నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ అంటే ఎంత హుశారైన మనిషో అన్న భావన అందరికి కలుగుతుంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆయన సరదా సంభాషణలు అందరిని నవ్విస్తాయి. అయితే ఇటీవల జరిగిన ఓ బేవార్స్ ఆడియో వేడుకలో ఎప్పుడు లేనిది ఎమోషనల్ గా మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్.
తల్లి లేని వారు తమ కూతురిలో తమ తల్లిని చూసుకుంటారని. అలానే తన 10 ఏళ్ల వయసులో తన తల్లి చనిపోగా ఒక్కగానొక్క కూతురు గాయత్రిలో తన తల్లిని చూసుకున్నానని అలాంటిది గాయత్రి తనని కాదని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుండి తనని నేరు దూరంగా పెట్టాను. అయితే బేవర్స్ చిత్రం కోసం సుద్ధల అశోక్ తేజా రాసిన తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట విని తన కూతురిని రమ్మన్నానని.. ఆమె వచ్చాక తాను ఈ పాటని 3,4 సార్లు వినిపించానని అన్నారు రాజేంద్ర ప్రసాద్.
మొత్తానికి సుద్ధాల పాట వల్ల రాజేంద్ర ప్రసాద్ తన కూతురిని కలుసుకోగలిగాడు. ఓ సినిమా పాటకు అంత ప్రత్యేకత ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో నటించారు. అంతగా నటకిరీటిని మార్చేసిన ఈ పాట ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.