పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్నారు. ముందుగా హరిహర వీరమల్లు ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలు ముస్తాబు అవుతాయి. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేసే ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు కాల్షీట్లు ఇస్తారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాగా.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు.దాదాపు మూడేళ్ల క్రితమే ఈ సినిమాపై ఎనౌన్స్మెంట్ వచ్చినా పవన్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇక ఈ సినిమాలో నటిస్తోన్న పవన్‌కు మైత్రీ వాళ్లు షాకింగ్ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ ఏకంగా 170 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ అనుకోవాలి.
ఓ రీజనల్ సినిమా కోసం ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. పవన్ క్రేజ్.. స్టామినా ఎలాంటిదో చెప్పేందుకు ఇది నిదర్శనం. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ సినిమా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.
‘ ఉస్తాద్ భగత్‌సింగ్ ‘ కోసం పవన్‌కు షాకింగ్ రెమ్యునరేషన్… వామ్మో అన్ని కోట్లా…!
