Moviesశ్రీనిధి శెట్టిని అలా చూసి మ‌న‌సు పాడేసుకున్న నాని...!

శ్రీనిధి శెట్టిని అలా చూసి మ‌న‌సు పాడేసుకున్న నాని…!

టాలీవుడ్లో కొత్త వాళ్లను బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళలో నేచురాల్ స్టార్‌ నాని ఒకడు. అతను ఎక్కువగా కొత్త, అప్‌కమింగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ సూప‌ర్ హిట్లు కొడుతూ ఉంటాడు. ఇక హీరోయిన్లు, మిగిలిన ఆర్టిస్టుల‌ను కూడా ఎక్కువుగా కొత్త వాళ్ల‌నే ప‌రిచ‌యం చేస్తూ ఉంటాడు. నాని హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డం త‌క్కువ‌. ఈ క్ర‌మంలోనే నాని తాజా చిత్రం హిట్ – 3 సినిమాలో కన్న‌డ అమ్మాయి కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమె నానితో జ‌ట్టుక‌ట్ట‌డం ఇదే తొలిసారి. అయితే ఈ ఛాన్స్ ఇచ్చింది ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను కాదు.. స్వ‌యంగా హీరో నానియే కావ‌డం విశేషం.HIT: The Third Case - Wikipediaఇది చాలా గ‌మ్మ‌త్తుగా జ‌రిగింద‌ని.. శ్రీనిధి స్వ‌యంగా తెలిపింది. శ్రీనిధి తెలుగులో కథానాయికగా నటించిన తొలి సినిమా ‘తెలుసు కదా’ ముహూర్త వేడుకకు వచ్చిన నాని.. తనకు ఛాన్స్ ఇచ్చినట్లు శ్రీనిధి తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా ‘తెలుసు కదా’. ఈ సినిమాలో శ్రీనిధితో పాటు రాశీఖ‌న్నా కూడా హీరోయిన్‌. నీర‌జ కోన నానికి బెస్ట్ ఫ్రెండ్ కావ‌డంతో ఆమె ద‌ర్శ‌కురాలిగా పరిచ‌యం అవుతున్న సినిమాకు వేడుక‌కు నాని వెళ్లాడు. అక్క‌డ శ్రీ నిధిని చూసిన నాని ఆమెకు త‌న సినిమాలో ఛాన్స్ ఇచ్చేశాడు.Srinidhi Shetty Phone Number, Contact Details, Mobileఆమె త‌న ప‌క్క‌న బాగా సెట్ అవుతుంద‌ని భావించి.. నానియే స్వ‌యంగా ఆమెకు త‌న ప‌క్క‌న హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే నాని ఏ సినిమా ముహూర్త వేడుకకు వెళ్లి శ్రీనిధిని తన సినిమాలోకి తీసుకున్నాడో ఆ సినిమా ఇంకా విడుదలకు సిద్ధం కాలేదు. ఈ లోగా హిట్ 3 పూర్త‌య్యి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంది.

Latest news