Moviesఅఖండ 2 బాలయ్య ఎంట్రీ సీన్ కోసం బోయపాటి ప్లానింగ్ పీక్స్...

అఖండ 2 బాలయ్య ఎంట్రీ సీన్ కోసం బోయపాటి ప్లానింగ్ పీక్స్ .. పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబోలో 2021 లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద విలయతాండవం చేసి బంపర్ హిట్ అందుకుంది .. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా అఖండ 2 రాబోతుంది .. ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ ఎప్పటికే అధికార ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి .. సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం అఖండ 2 సినిమాకి నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తిని ఎంపిక చేస్తున్నారని తెలుస్తుంది.Akhanda 2 : అఖండ 2లో బాలయ్య డైలాగ్స్ చెబితే థియేటర్ దద్దరిల్లాల్సిందే - NTV  Teluguమొదటి సినిమాకు మించిన అఖండ 2 సినిమా భారీ బడ్జెట్ తో తెర‌క్కిస్తున్నట్లు తెలుస్తుంది. అఖండ విజయానికి మించి అఖండ‌2 సాధిస్తుందని సినిమా యూనిట్ నమ్మకంగా ఉంది. ఇక దీంతో అఖండ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. బోయపాటి శ్రీను ఇప్పటికే అఖండ 2 స్క్రిప్టును పూర్తి చేశాడు . ప్రస్తుతం ఈ సినిమా డైలాగ్ వెర్షన్‌కు సంబంధించిన కసరతులు జరుగుతున్నాయి.. కాగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది ..బోయపాటి పవర్ఫుల్ లైన్ అప్.. హీరోలు ఎవరంటే.. | Boyapati Srinu Powerful Line  upఅలాగే మరోవైపు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన లొకేషన్స్ ను కూడా బోయపాటి ఫైనల్ చేశాడు. జనవరి మూడో వారం నుంచి అఖండ పాత్రకు సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను తెర్కక్కించబోతున్నారట అందులో భాగంగానే బాలయ్య ఎంట్రీ కోసం ప్రత్యేకంగా సెట్‌ను వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి , బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదుయ్య‌యి అఖండ తాండవంతో డబుల్ హ్యాట్రిక్ కుబాల‌టు వేయాల‌ని బోయపాటి గట్టి ప్లాన్ తో ఉన్నాడు . ఇక మరి బోయపాటి – బాలయ్య ఈ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ పై ఎలాంటి సంచలన‌లు క్రియేట్ చేస్తారో చూడాలి.

Latest news