Moviesఅల్లు అర్జున్ కోసం ప‌వ‌న్ ఏం చేస్తున్నాడంటే... ?

అల్లు అర్జున్ కోసం ప‌వ‌న్ ఏం చేస్తున్నాడంటే… ?

సంథ్య థియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన గొడ‌వ‌లో అరెస్టు అయ్యి ఒక రాత్రి జైలులో ఉండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ను ప‌లువురు సెల‌బ్రిటీలు పరామ‌ర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లు అర్జున్‌ను ఈ రోజు పరామర్శించనున్నట్లుగా తెలుస్తోంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఆయన అర్జున్ నివాసానికి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇక శ‌నివారం సాయంత్ర‌మే ప‌వ‌న్ హైద‌రాబాద్‌లోని త‌న నివాసానికి చేరుకున్నాడు.Telangana HC grants Allu Arjun interim bail hours after arrest in Pushpa 2  premiere stampede case | India News - The Indian Expressఇక అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన అంశంపై ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ఇంకా సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. త‌న కుటుంబ సభ్యుడు కావడంతో సోషల్ మీడియాలో స్పందించడం కన్నా నేరుగా వెళ్లి పరామర్శించడమే మంచిదని ప‌వ‌న్ డిసైడ్ అయిన‌ట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సంథ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.ఇక హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చినా కూడా బ‌న్నీ ఒక రోజంతా జైలులోనే ఉన్నారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆయ‌న రిలీజ్ అయ్యారు. ఇక బ‌న్నీ అరెస్టు విష‌యంలో అన్ని పార్టీల నాయ‌కులు ఒకే స్టాండ్‌తో వ్య‌తిరేకించారు. ఇక కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నేతలు కూడా అరెస్టును వ్యతిరేకించారు. ఏపీలోని వైసీపీ పార్టీ ఇదే అద‌నుగా బ‌న్నీకి త‌న స‌పోర్ట్ ప్రకటించింది.ఇక ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నేరుగా అరవింద్ కు, అర్జున్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ నేరుగా పరామర్శించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news