సంథ్య థియేటర్ ఘనటలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడు. ఈ కేసులో బన్నీ అరెస్టుపై రకరకాల సందేహాలు ఉన్నాయి. లీగల్‌గా చూస్తే ఈ అరెస్టు కరక్టే .. అయితే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు కావాలనే అరెస్టు చేశారంటూ వస్తోన్న వార్తల్లో నిజం ఎంత అన్నది కాసేపు పక్కన పెడదాం. అయితే రేవతి మృతి తర్వాత అల్లు అర్జున్ పీఆర్ టీం అదే రోజు రాత్రి స్పందించి ఉంటే బాగుండేది.. ఉదయం అయినా హాస్పటల్‌కు వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించడంతో పాటు అక్కడ కార్యక్రమాల్లో కొంత సేపు అయినా యాక్టివ్‌గా ఉండి ఉంటే ఈ రోజు ఇంత చర్చ ఉండేది కాదు.బన్నీ పుష్ప 2 కోసం దాదాపు రు. 250 – 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని అంటున్నారు. రేవతి మృతి తర్వాత జస్ట్ రు. 25 లక్షలు ఇచ్చారు. దీనిపై కూడా కొంత చర్చ జరిగింది. అదే బన్నీ నేరుగా రేవతి మృతదేహానికి నివాళులు అర్పించి .. రు. 50 లక్షలు లేదా ఏ కోటి రూపాయలో ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. రేవతి ప్రాణం ఖరీదు జస్ట్ రు. 25 లక్షలేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.అదే లాయర్ల ఫీజుకు బన్నీ కోట్లలోనే ఖర్చు చేసి ఉంటాడు. శుక్రవారం ముందుగా నాంపల్లి కోర్టులో మొదలైన వాదనలు.. ఆ వెంటనే హైకోర్టుకు చేరాయి. చాలా ఫేమస్ లాయర్ నిరంజన్ రెడ్డి ఇక్కడ లాయర్‌గా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన టీం అంతా నిన్న ఎఫర్ట్ పెడితే కాని.. సాయంత్రానికి బన్నీకి బెయిల్ రాలేదు. ఈ ప్రాసెస్ ఊరుకునే అవ్వదు.. లక్షలు దాటి కోట్లలోనే ఖర్చు అయ్యి ఉండొచ్చు.. అదే బన్నీ ఆ రోజు రేవతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి రు. 50 లక్షలో లేదా… ఏ కోటి రూపాయలు ఇచ్చి ఉంటే మరింత బాగుండేది.
Moviesలాయర్ల ఫీజులు కోట్లు... రేవతికి రు. 25 లక్షలా.. ఇదెక్కడి న్యాయం..?
లాయర్ల ఫీజులు కోట్లు… రేవతికి రు. 25 లక్షలా.. ఇదెక్కడి న్యాయం..?
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి
- Tags
- allu arjun
- Allu Arjun case
- bunny
- Bunny arrest
- bunny release
- enjoying news
- entertaining news
- entertainment news
- exciting news
- filmy updates
- genuine news
- intresting news
- intresting updates
- journalist excluisve
- Latest News
- latest trending news
- pushpa
- pushpa 2
- revathi
- Sandhya Theatre
- social media
- star hero
- star heroine
- super news
- Tollywood
- tollywood filmy updated news
- very useful news
- viral news
Previous articleబన్నీ అరెస్టు.. రిలీజ్ మధ్యలో ఇంత హైడ్రామా నడిచిందా..!
Next articleఅల్లు అర్జున్ కోసం పవన్ ఏం చేస్తున్నాడంటే… ?