టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్‌గా.. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “పుష్ప 2 ది రూల్”. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సీక్వెల్ ముందు నుంచి అంచనాలు ఉన్నట్టుగానే భారీ రికార్డు ఓపెనింగ్స్ అందుకొని ఇండియన్ సినిమా దగ్గర సరికొత్త అధ్యాయం క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా ముందు నుంచి రు. 1000 కోట్లు చాలా సులువుగా క్రాస్ చేస్తుందనే అందరూ అనుకున్నారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండానే పుష్ప 2 బాక్సాఫీస్‌ను రూల్ చేస్తూ తొలి రోజే ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకు లేనట్టుగా ఏకంగా రు. 294 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక కేవలం 6 రోజుల్లోనే రు. 1000 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే చాలా వేగంగా రు. 1000 కోట్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కేసింది.
ఇప్పుడు వరకు బాహుబలి 2 ఫాస్టెస్ట్ 1000 కోట్ల గ్రాసింగ్ సినిమాగా 10 రోజుల్లో ఉంది. దానిని నాలుగు రోజులు ముందే టచ్ చేసి అల్లు అర్జున్ చరిత్ర తిరగరాశాడు. ఓవరాల్‌గా చూస్తే మొల్లేటి పుష్పరాజు పేరిట ఈ నెవర్ బిఫోర్ రికార్డు కూడా వచ్చి పడింది. ఇక ఈ సినిమా రు. 1500 కోట్లు దాటుతుందా.. లాంగ్ రన్ లో బాహుబలి 2 పేరిట ఉన్న రు. 1800 కోట్లు క్రాస్ చేస్తుందా ? అన్నదే చూడాలి.