Moviesఖుషి మూవీ నడుము సీన్లో భూమిక కాదు.. ఆ హీరోయిన్ .....

ఖుషి మూవీ నడుము సీన్లో భూమిక కాదు.. ఆ హీరోయిన్ .. తెర వెనుక జ‌రిగిందిదే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక హీరో హీరోయిన్లు నటించిన ఖుషి మూవీ ఎవర్ గ్రీన్.. ఈ సినిమా థియేటర్లోనే కాదు టీవీలలో వచ్చినా చాలా మంది పవర్ స్టార్ ఫ్యాన్స్ కల్లార్పకుండా చూస్తారు. ఇక ఈ సినిమాలో అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేసింది భూమిక నడుము సీన్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్. అయితే మొదట ఈ సినిమాలో భూమిక బదులు మరో హీరోయిన్ నటించిందట. అంతేకాదు నడుము సన్నివేశాన్ని కూడా పూర్తి చేశారట. కానీ ఉన్నట్టుండి ఆ హీరోయిన్ అందులో నుండి తప్పుకుంది.

ఇక ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకుంది అనేది చూద్దాం.. ఎస్.జే. సూర్య దర్శకుడిగా, ఏ.ఎం.రత్నం నిర్మాతగా వచ్చిన ఖుషి మూవీలో పవన్ కళ్యాణ్ సరసన మొదట హీరోయిన్ గా బాలీవుడ్ నటి అమీషా పటేల్ ని తీసుకున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందే బద్రి సినిమాలో ఈమెను ఫిక్స్ చేశారు. అలా బద్రి సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఖుషి మూవీ షూటింగ్ కూడా మొదలెట్టేశారు. అయితే ఖుషి మూవీ కి ముందు చెప్పాలని ఉంది అనే టైటిల్ ని ఫిక్స్ చేసి అమీషా పటేల్ తో కొద్ది మేర షూటింగ్ కూడా జరిపారట.

అలా భూమిక చేయవలసిన నడుము సీన్ ముందుగానే అమీషా పటేల్ తో చేశారట. అయితే ఒకేసారి అటు బద్రి ఇటు ఖుషి మూవీ లో నటించడం ఇబ్బంది అవుతుందని ఖుషి మూవీని కొద్ది రోజులు వాయిదా వేసుకున్నారట పవన్ కళ్యాణ్. ఇక అదే సమయంలో బాలీవుడ్ లో అమీషా పటేల్ నటించిన కహో నా ప్యార్ హై అనే మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో అమీషా పటేల్ కి బాలీవుడ్ బ్రహ్మ రథం పట్టి ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. దాంతో ఖుషి మూవీ షూటింగ్ తన కారణంగా లేట్ అవ్వకూడదు అనే ఉద్దేశ్యం తో ఆ మూవీ నుండి తప్పుకుంటున్నట్లు చెప్పింది.

అలా అమీషా పటేల్ పక్కకు తప్పుకోవడంతో ఈమె ప్లేస్ లో హీరోయిన్ భూమికని తీసుకున్నారు. అలా అమీషా పటేల్ కి బదులు ఖుషి మూవీలో భూమిక నటించింది. ఇలా తెర వెనుక ఖుషి మూవీ సమయంలో ఎన్నో జరిగిపోయాయి. అలాగే చెప్పాలని ఉంది అనే టైటిల్ కాస్త ఖుషి గా మారింది. అయితే దీని వెనక కూడా ఓ కథ ఉంది. అదేంటంటే..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నార్త్ ఇండియా నుండి వస్తాడు కాబట్టి సినిమా టైటిల్ ని హిందీలో పెట్టాలి అనుకున్నారట.అలా చెప్పాలని ఉంది అనే టైటిల్ ని ఖుషి గా మార్చేశారు డైరెక్టర్ ఎస్. జే. సూర్య.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news