టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “ పుష్ప 2 ది రూల్ ” . ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర తన జర్నీ స్టార్ట్ చేసింది. రిలీజ్ అయిన పస్ట్ డే నుంచి పుష్ప 2 సినిమా భారీ వసూళ్లు కొల్లగొట్టి ఎన్నో రికార్డులు సెట్ చేసింది.ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సైతం దూసుకుపోతోన్న పుష్ప గాడు యూఎస్ మార్కెట్లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. అయితే ఇప్పుడు అక్కడ 11 రోజులు దాటగానే బాగా స్లో అయినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే ఇంకా కనీసం 4 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాల్సి ఉందట.
సెకండ్ వీకెండ్‌లో పుంజుకోకపోతే అక్కడ బ్రేక్ ఈవెన్ కాదు కదా పుష్ప 2 సినిమాకు నష్టాలు తప్పవని అంటున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.. సామ్ సి ఎస్ అదనపు నేపథ్య సంగీతం అందించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
భారీగా డ్రాప్ అయిన ‘ పుష్ప 2 ‘ వసూళ్లు… లాభాలు సరే.. బ్రేక్ ఈవెనూ కష్టమేనా.. ?
