సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకా వీడియోలు కూడా బాగా ట్రెండ్ చేస్తూ వస్తున్నారు జనాలు. మరికొందరు మంచి కోసం ట్రెండ్ చేస్తే ఇంకొందరు మాత్రం ఆ బాధలను గుర్తు చేయడానికి అలాంటి వీడియోలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు . అయితే తెలిసి చేస్తున్నారో కావాలనే చేస్తున్నారు తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి మనోవేదనకు గురైన ఒక వీడియోకి సంబంధించిన విషయాన్ని పదే పదే ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకుంది. తన క్లాస్మేట్ శిరీష్ భరద్వాజ్ ని ఇంట్లో చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకుని మీడియాలో కనిపించిన విషయం తెలిసిందే .
అప్పటివరకు చాలా సైలెంట్ గా ఉన్న శ్రీజ .. ఒక్కసారిగా తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ న్యూస్ ఎంత సంచలనం రేపింది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . తెలుగు చిత్ర పరిశ్రమకు మెగాస్టార్ లా ఉన్న చిరంజీవి కూతురు ఇంట్లో చెప్పకుండా పారిపోయి గుడిలో పెళ్లి చేసుకోవడం .. అది కూడా తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది అని కోర్టులో కేసు వేయడానికి కూడా సిద్ధపడటం అప్పట్లో చర్చనీయాంశం అయింది .
మీడియాలో ఎక్కడ చూసినా చిరంజీవి కూతురు శ్రీజ పేరే మారుమ్రోగిపోయింది . అంతేకాదు వాళ్లు గుడిలో పెళ్లి చేసుకున్న పిక్స్ ని కూడా పదే పదే టెలికాస్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీ పరువు ని తీయడానికి కొంతమంది చూశారు . అయితే చిరంజీవి మాత్రం చాలా హుందాగా ప్రవర్తించాడు . శ్రీజ శిరీష్ లు పెళ్లిపై అప్పట్లో ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోని మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . కూతురు చేసిన పని గురించి తన మనోభావాన్ని వెల్లడిస్తూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
” శ్రీజ చేసిన పని మాకు షాకింగ్ గా ఉంది . తను మేజర్ ఒప్పుకుంటున్నాము.. అయితే తన సుఖసంతోషాలే మాకు ముఖ్యం.. ఎప్పుడు పిల్లల ఇష్ట ఇష్టాలకు మేము గౌరవం ఇస్తూనే ఉంటాం. శ్రీజ ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం .. నా ఫాన్స్ కి నా శ్రేయోభిలాషులకి నా కుటుంబ సభ్యులకి ఒకటే చెబుతున్నాను ..శ్రీజని ఇబ్బంది పెట్టొద్దు ..మీ ఆశీస్సులు నా బిడ్డకు కావాలి ..అదే ఆమెకు శ్రీరామరక్ష” అంటూ ఆ వీడియోలో మాట్లాడారు. అయితే దాదాపు 16 ఏళ్ల క్రితం చిరంజీవి మాట్లాడిన ఆ వీడియోని కొందరు మరోసారి ట్రెండ్ చేస్తూ ఉండడం గమనార్హం. కాగా రీసెంట్ గానే చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ మొదటి భర్త మరణించాడు . ఈ నేపథ్యంలోనే మరొకసారి వీళ్ళు పారిపోయి పెళ్లి చేసుకున్న పిక్చర్స్ ని వీడియోస్ ని బాగా బాగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..!!