సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మర్యాదలు చేయడంలో టాప్ .. ఎంతైనా రాజుల ఫ్యామిలీ కదా..? ప్రెసెంట్ సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తున్న ప్రభాస్ ని.. కొందరు అభిమానులు ఆయన స్వగృహంలో కలిశారు . దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
నిజానికి ప్రభాస్ ఎవరు తన ఇంటికి వెళ్ళినా సరే చాలా చాలా బాగా ప్రేమగా ..ఆప్యాయంగా పలకరిస్తాడు.. గౌరవ మర్యాదలతో సత్కరిస్తాడు. కేవలం డబ్బున్న స్టార్ హీరోస్ మాత్రం వెళ్తేనే కాదు తన సొంత ఫ్యాన్స్ వెళ్లినా సరే అలా చేస్తాడు . రీసెంట్గా ఆయనను కలవడానికి కొంత మంది ఆయన ఇంటికి వెళ్లారు. ఫాన్స్ ని సైతం అదేవిధంగా ట్రీట్ చేశారట.
దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. నువ్వు నిజంగానే రాజువి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు కొందరు హీరోలు ఫ్యాన్స్ ని చులకనగా చూస్తారు అని .. కానీ నువ్వు మాత్రం ఫ్యాన్స్ ని చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటావు అని ..నీలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం అంటూ ప్ర్శంసిస్తున్నారు..!