దీన్ని జాక్పాట్ ఆఫర్ అనాలో.. లేకపోతే బలవంతంగా ఇప్పించే ఆఫర్ అనాలో అర్థం కావడం లేదు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో సంయుక్త మీనాన్ కి సంబంధించిన ఈ వార్త మహా ట్రెండ్ అయిపోతుంది. సంయుక్త మీనన్ మలయాళీ బ్యూటీ .. కానీ తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకో పోయే హీరోయిన్ . అసలు సంయుక్త హీరోయిన్స్ తో కలిసిన మూమెంట్స్ మనం చాలా చాలా తక్కువగా చూస్తాం. మొదటి నుంచి సంయుక్త మీనన్ అంతే .
తన పని తాను చూసుకొని పోతుంది . ఎవరి విషయాలను పెద్దగా పట్టించుకోదు . తనకు నచ్చిందా..? సినిమా చేస్తుంది.. నచ్చలేదా..? సినిమాను రిజెక్ట్ చేస్తుంది ..అంతే . అయితే తాజాగా సంయుక్త మీనన్ కి కోలీవుడ్ స్టార్ హీరో బంపర్ ఆఫర్ ఇచ్చారట . ఆమెను తన సినిమాలో ఐటమ్ సాంగ్ నటింపజేయాలి అంటూ ట్రై చేస్తున్నారట . అంతేకాదు దీనికోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనిరేషన్ కూడా ఆమెకు ఫిక్స్ చేశారట.
జనరల్ గా సంయుక్త సినిమాకు కోటి .. రెండు కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది . అయితే ఏకంగా ఆ రెమ్యూనరేషన్ డబల్ చేసి ఐదు కోట్లు ఇస్తానన్నాడు ఆ కోలీవుడ్ స్టార్ హీరో అంటూ సినీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది . హైలెట్ న్యూస్ ఏంటంటే సంయుక్త మీనన్ ఐదు కోట్లు కాదు పది కోట్లు ఇస్తానన్నా కూడా ఐటమ్ సాంగ్ చేయను అంటూ తెగేసి చెప్పిందట .సంయుక్త డేరింగ్ డెసిషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాలో..? అంత పెద్ద మంచి ఆఫర్ ని రిజెక్ట్ చేసుకుంది అని బాధపడాలో..? తెలియడం లేదు అంటూ సంయుక్త ఫ్యాన్స్ జనాలు కామెంట్స్ చేస్తుంటే ..సంయుక్త ఫాన్స్ మాత్రం శభాష్ సంయుక్త యూ ఆర్ రియల్ హీరోయిన్ అంటూ పొగిడేస్తున్నారు..!
సంయుక్తా మీనన్ భీమ్లా నాయక్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయింది . ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది . ప్రజెంట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ముందుకు దూసుకెళ్తుంది..!!